బ‌ర్రెకు బ‌ర్త్‌డే.. ఊరంద‌రికీ విందు!

క‌లం, వెబ్‌డెస్క్: ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ (Uttar Pradesh)లో ఓ ఫ్యామిలీ బ‌ర్రెకు బ‌ర్త్‌డే (Buffalo Birthday) చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారారు. బ‌ర్త్‌డే అంటే ఏదో ఓ అర‌కేజీ కేక్ క‌ట్ చేసి మ‌మ అనిపించ‌లేదు. ఊరంద‌రికీ విందు, ఆర్కెస్ట్రా, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ధూమ్ ధామ్‌గా వేడుక‌లు చేశారు. యూపీలోని బ‌లియాలో ఈ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌ద‌రు ఫ్యామిలీ ప్రేమ‌గా బ‌ర్రెకు బ‌సంత అని పేరు పెట్టుకున్నారు. నాలుగో పుట్టిన రోజు సంద‌ర్భంగా బసంతకు పూల దండలు వేసి, తలపై హ్యాపీ బర్త్‌డే క్యాప్ పెట్టి కేకులు కట్ చేశారు.

ఈ వేడుకను కేవలం కేక్ కటింగ్‌తో ఆపకుండా గ్రామ‌స్తులంద‌రికీ భారీ సామూహిక విందును ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ఆర్కెస్ట్రా, డ్యాన్స్ పెర్ఫామెన్సెస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాము ప్రతి ఏటా బసంత పుట్టినరోజును ఇలాగే గ్రాండ్‌గా చేస్తున్నామ‌ని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ బ‌ర్త్‌డేకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>