గద్వాలలో విషాదం: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు దుర్మరణం

కలం, వెబ్ డెస్క్ : జోగులాంబ గద్వాల (Gadwal Accident) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అల్లంపూర్ తాలూకా ఎర్రవల్లి మండలంలోని 44వ జాతీయ రహదారిపై టెన్త్ పఠాలం ఎదురుగా ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చనిపోయిన వారిని మౌనిక , సాయికుమార్ గా గుర్తించిన పోలీసులు.. గాయపడిన డ్రైవర్ ముఖేశ్ ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం కోసం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. హైదరాబాద్ వైపు నుంచి గద్వాల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణం అతివేగమా? డ్రైవర్ నిర్లక్షమా? ఇతర కారణాలా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>