నిర్మల్‌లో ఘనంగా ‘శ్రీ కృష్ణ జన్మాష్టమి’ వేడుకలు

కలం, నిర్మల్: శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami) పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో గల శ్రీ మురళీకృష్ణ ఆలయం (Murali Krishna Temple) భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జన్మాష్టమి సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణుడికి తులాభారం నిర్వహించగా భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఆలయ ప్రాంగణం శ్రీకృష్ణ నామస్మరణతో మార్మోగింది.

Also Read : బీఆర్ఎస్‌లోకి కొండా సురేఖ.. జగదీశ్ రెడ్డి ఏమన్నారంటే?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>