కవితపై అసభ్యకర వ్యాఖ్యలు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఓ కానిస్టేబుల్ సోషల్ మీడియాలో చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై పార్టీ మెదక్ నియోజకవర్గ (Medak TRS) నేతలు మండిపడ్డారు. కామెంట్స్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ ఇన్‌ఛార్జి బట్టి అజయ్ ఆధ్వర్యంలో మెదక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత అభిప్రాయాల పేరుతో మహిళల గౌరవానికి, వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసి, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు నిజమని తేలితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>