ఆసియన్ గేమ్స్: కోచ్‌గా లక్ష్మణ్.. వెస్టిండీస్ సిరీస్‌కే గంభీర్!

కలం, స్పోర్ట్స్: జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ (Asian Games) 2026 పోటీలకు సంబంధించి క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం వెల్లడించింది. ఈ టోర్నీలో భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా వివిఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో స్వదేశంలో వన్డే సిరీస్ ఉన్నందున, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) సీనియర్ జట్టుతోనే భారత్‌లో ఉంటారు.

లక్ష్మణ్ సహాయకులుగా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి, హృషికేష్ కనిట్కర్, సుభాదీప్ ఘోష్‌లను నియమించారు. 2023 చైనా ఆసియన్ గేమ్స్‌(Asian Games)లో భారత జట్టుకు బంగారం అందించిన అనుభవం లక్ష్మణ్‌కు ఉంది. ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. సెప్టెంబర్ 24 నుంచి క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత పురుషుల జట్టు సెప్టెంబర్ 28న తొలి మ్యాచ్ ఆడనుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గ్రూప్-Aలో ఉన్న అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ జట్లలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ తలపడుతుంది. మరోవైపు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్లో హోస్ట్ జపాన్‌ను ఢీకొడుతుంది. మహిళల జట్టుకు అమల్ ముజుందార్ కోచ్‌గా, ఆవిష్కార్ సాల్వి, మునీష్ బాలి సహాయకులుగా కొనసాగుతారు.

భారత పురుషుల జట్టు

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.

మహిళల జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, ప్రతీకా రావల్, దీప్తి శర్మ, రిచా ఘోష్, గుణలన్ కమలిని, భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, నందని శర్మ.

Also Read : రోహిత్‌పై బీసీసీఐ కీలక సంకేతం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>