కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై చిన్నారెడ్డి షాకింగ్ రియాక్షన్!

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్​ పార్టీ రూల్స్​ బ్రేక్​ చేసినందుకుగానూ కొండా సురేఖ(Konda Surekha)తో పాటు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న చిన్నారెడ్డిపై వేటు పడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి (Chinna Reddy) స్పందించారు. వేటు వేసిన కొద్ది గంటల్లోనే ఆయన పంటపొలాల్లో ప్రత్యక్షమయ్యారు. తనకు పదవులపై ఎలాంటి సోకు లేదని స్పష్టం చేశారు. పదవి లేకున్నా తనకు గౌరవం ఉందని అన్నారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నాటి నుంచి తాను పార్టీలో కొనసాగుతున్నానని అన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, కష్టపడి ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు.

భవిష్యత్తు కార్యాచరణపై ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన చేయలేదని చిన్నారెడ్డి చెప్పారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తూనే, భవిష్యత్తులో ఏం చేయాలనే అంశంపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని ఆయన (Chinna Reddy) తెలిపారు.

Also Read : రాఖీ రద్దీలో రికార్డు రాబడి.. వనపర్తి డిపోకు 137శాతం ఓఆర్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>