కలం, వెబ్ డెస్క్ : గంజాయి డాన్ నీతు భాయ్ ఇళ్లలో ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ పోలీసులతో పాటు ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. నగరంలోని ఎనిమిది విభిన్న ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి అక్రమ విక్రయాల ద్వారా నీతు భాయ్ (Neetu Bhai) కోట్ల రూపాయలు సంపాదించినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది.
ఈ డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన భారీ సొమ్మును హవాలా మార్గాల్లో మళ్లించినట్లు ఈడీ స్పష్టమైన ఆధారాలు సేకరించింది. నీతు భాయ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఆగడాలపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా, గతంలో హైదరాబాద్ పోలీసులు ఆమెపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు.

