మూడేళ్లలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాబోయే మూడు ఏళ్లలో నగరంలోని ప్రతి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (Underground Drainage) పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని వివిధ డివిజన్లలో యూజీడీ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నగర సమగ్ర అభివృద్ధిలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను విస్తరించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రజలిచ్చిన ఈ అవకాశం ప్రజాసేవకే అంకితం చేయాలని లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని ఆయన (Yennam Srinivas Reddy) తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిరాజ్ ఖాద్రీ, అజ్మత్ అలి, 22వ డివిజన్ కార్పొరేటర్ ఎం. జ్యోతితో పాటు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Also Read : రాష్ట్రంలో రాబోయేది వైఎస్సార్ యుగం.. రాజ‌గోపాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>