యూఎస్‌లో తెలుగు వారి కథ: షాకింగ్ వీడియో వైరల్!

కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో నివసిస్తున్న తెలుగు (Telugu NRI) వారి కుటుంబ బంధాలు, అక్కడ కొందరి జీవనశైలిపై ఒక మహిళ మాట్లాడిన పబ్లిక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఎన్‌ఆర్‌ఐల లైఫ్‌స్టైల్, వివాహేతర సంబంధాలు, అక్కడ కొందరు ప్రవర్తిస్తున్న తీరుపై సదరు మహిళ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ వీడియో వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె చేసిన వ్యాఖ్యలు అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐ సమాజం మొత్తాన్ని ఇలా జనరలైజ్ చేయడం ఎంతమాత్రం సరికాదని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అమెరికాలోని తెలుగు కమ్యూనిటీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారి చర్చకు దారితీసింది.

Also Read : కుటుంబం కోసం.. ప్రాణాలకు తెగించి సాహసం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>