ఏపీలో సర్ గడువు పెంపు.. అదే చివరి రోజు!

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సర్ (Andhra Pradesh SIR) గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇంకా ఓటు నమోదు చేసుకోవాని వారు వెంటనే అప్లై చేసుకోవాలని సూచించింది. క్లెయిమ్స, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5వ తేదీ వరకు గడువుగా నిర్ణయించింది. అక్టోబర్ 9న తుది జాబితా విడుదల చేయబోతున్నారు. దీనిలో పేర్లు ఉన్న వారు మాత్రమే రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉంటారు. సవరించిన తేదీలను రాష్ట్ర గెజిట్‌లో వెంటనే ప్రచురించాలని రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారికి ఆదేశాలు జారీ చేసింది.

వివరాలు సరి చూసుకోవాలని..

కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, ఇప్పటికే నమోదైన వారు పేర్లు, చిరునామా, ఇతర వివరాలను సరిగ్గా చెక్ చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఏదైనా తప్పుగా ప్రచురితమైతే.. అక్టోబర్ 5వ తేదీ వరకు పరిష్కరించుకోవచ్చని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు, సిబ్బంది ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలని ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>