కలం, సినిమా : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని(Gopichand Malineni) కాంబినేషన్లో మరో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘NBK 111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది. బాలయ్య మాస్ పెర్ఫామెన్స్, థమన్ బీజీఎం సినిమాకు సూపర్ హైప్ క్రియేట్ చేశాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 6న ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను వెల్లడించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ స్పెషల్ పోస్ట్ చేశారు. అయితే బాలయ్య నటిస్తున్న ఈ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్కి మేకర్స్ ‘దాదా’ అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

