కలం, నిర్మల్: చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్ఈ (Nirmal SE) రమేష్ తెలిపారు. సర్కిల్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం ద్వారా ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలను వినియోగించుకోవచ్చన్నారు. చిన్నారులకు సౌకర్యవంతమైన విద్యా వాతావరణంతో పాటు పోషకాహారం, ఆరోగ్య, పరిశుభ్రత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు విద్యుత్ సదుపాయం దోహదపడుతుందని పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమాన్ని సామాజిక బాధ్యతగా భావించి ప్రతి అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈ రమేశ్ తెలిపారు.

