ప్రియాంక గాంధీ ‘గోమూత్ర’ సెటైర్.. 215 మంది వీసీల బహిరంగ లేఖ

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల లోక్‌సభలో పరీక్షల సంస్కరణ కమిటీపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నీట్ పేపర్ లీక్ కేసుపై నియమించిన హైపవర్డ్ కమిటీలో గోమూత్ర నిపుణుడైన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటిని నియమించారని ఆమె ఎద్దేవా చేయడంపై విద్యావేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా 215 మంది విద్యావేత్తలు ప్రియాంక గాంధీకి బహిరంగ లేఖ రాశారు.

రాజకీయాల కోసం ఉన్నత విద్యావేత్తను అపహాస్యం చేయడం తగదని ఈ లేఖలో విద్యావేత్తలు పేర్కొన్నారు. ప్రతి విద్యావేత్త తరహాలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక హైపోథీసిస్ ప్రెజెంట్ చేస్తారని తెలిపారు. ఓ ప్రఖ్యాత విద్యావేత్తకు అలాంటి ముద్ర వేయడం సరికాదని అంటూ 215 మంది వైస్ ఛాన్స‌ల‌ర్లు, మాజీ వీసీలు లేఖలో పేర్కొన్నారు. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా, బ్యాక్టీరియా, ఫంగ‌స్‌ను నియంత్రించే శ‌క్తి గోమూత్రానికి ఉంద‌ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటి ఓ స్ట‌డీ ద్వారా వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>