కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) వైజాగ్ చేరుకున్నారు. శ్రీకాకుళంలో జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వెళ్లనున్నారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని.. లేకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పార్టీ గాజువాక ఇన్‌ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ను కూడా అడ్డుకున్నారు.
పోలీసులపై అమర్నాథ్ ఆగ్రహం..
జగన్‌కు (YS Jagan) స్వాగతం పలికేందుకు వస్తున్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా జగన్ పర్యటన అడ్డుకోవాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. తమ కార్యకర్తలు వస్తూనే ఉంటారని తేల్చి చెప్పారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు జనం స్వచ్ఛందంగా జనం రోడ్ల మీదకు రావడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.
Read Also: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు: సిట్ కస్టడీలోకి సీఐ నాగరాజు!
Follow Us On: Instagram

