నిలిచిన చాట్ జీపీటీ సేవలు.. అసలేమైందంటే?

కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్ జీపీటీ సేవలు (ChatGPT Down) ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో యూజర్లు ఈ ఏఐ సేవలను యాక్సెస్ చేయలేకపోతున్నారు. OpenAI సంస్థ చాట్ జీపీటీ డౌన్ కావడాన్ని ధృవీకరించింది. ప్రస్తుతం అమెరికా, యూరప్, భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో చాట్ జీపీటీ సేవలకు అంతరాయం ఏర్పడింది.

దీంతో ఏఐ యూజర్స్ భారీ స్థాయిలో సమస్యలను సోషల్ మీడియాలో రైజ్ చేస్తున్నారు. OpenAI అధికారిక స్టేటస్ పేజీలో కూడా ఈ సమస్యను అంగీకరించింది. జాబితా చేయబడిన సేవలకు సంబంధించిన సమస్యపై దర్యాప్తు చేస్తున్నట్లు అని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం సేవలు సాధారణ స్థితికి రావాలంటే కొంత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. సమస్య పరిష్కరించిన వెంటనే అప్‌డేట్ ఇవ్వనున్నట్లు OpenAI వినియోగదారులకు వివరించింది. తమ సేవలు నిలిచిపోవడంతో ఇతర AI టూల్స్‌ను వాడాలని ఓపెన్ ఏఐ సంస్థ సూచిస్తోంది.

Read Also: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఫ‌డ్న‌వీస్‌.. సంజ‌య్ రౌత్ కీల‌క వ్యాఖ్య‌లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>