‘జన నాయగన్’ ఎడిటింగ్ షాక్.. నటి ఎమోషనల్

కలం, సినిమా : తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్ (vijay) నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ’ జన నాయగన్'( Jana Nayagan) జులై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ అయింది. సెన్సార్ వివాదంతో గత కొన్ని నెలలుగా రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కావడంతో విజయ్ అభిమానులు థియేటర్స్‌కి క్యూ కట్టారు. రిలీజ్‌కి ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన తమిళ నటి ఆనంది అజయ్ (Anandhi Ajay) తన సన్నివేశాలను ఎడిటింగ్‌లో తొలగించడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విజయ్‌తో కలిసి నటించాలనే తన ఎన్నో ఏళ్ల కల ‘జన నాయగన్’ తో నెరవేరినట్లుగా భావించానని, ఆ పాత్ర కోసం దాదాపు ఏడాది పాటు ఎంతో కష్టపడ్డానని ఆమె తెలిపారు. అయితే చివరి నిమిషంలో తన సన్నివేశాలన్నీ తొలగించడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్‌లు  ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. “ఆనంది ధైర్యంగా ఉండాలి.. భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>