గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కలం, వెబ్ డెస్క్: గతరెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు (Gold and Silver Prices) శుక్రవారం భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,850 తగ్గి రూ.1,44,330కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,700 పతనమై రూ.1,32,300 గా ఉంది. 18 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,250గా ఉంది. అటు కేజీ వెండి ధర ఏకంగా రూ.5,000 తగ్గి రూ.2,40,000 పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అమలులో ఉన్నాయి. హైదరాబాద్ తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి నగరాల్లో దాదాపు ఇవే ధరలు అమలులో ఉన్నాయి. ఇక దేశంలోని ప్రముఖ నగరాలైన చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, అహ్మదాబాద్, తిరువనంతపురంలో ఇవే ధరలు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>