కాక్రోచ్ పార్టీ దేశ ద్రోహుల పార్టీ: ఎమ్మెల్యే ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: కాక్రోచ్ పార్టీ, దానికి మద్దతు తెలుపుతున్న పార్టీలు దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal Suryanarayana) ధ్వజమెత్తారు. ప్రధాని నివాసం వద్ద అరాచకం సృష్టించిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బుధవారం నిజామాబాద్ (Nizamabad) నిఖిల్ సాయి చౌరస్తాలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఒకప్పుడు ఆప్ పార్టీ సోషల్ మీడియా వాలంటీర్ గా పని చేశాడని గుర్తు చేశారు.

ఒక వైపు ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలబడితే, కాంగ్రెస్ మాత్రం అధికారం కోసం అరాచక కార్యక్రమాలను చేపడుతుందని మండిపడ్డారు. దేశ ప్రధాని మోదీ అభివృద్ధి పాలన చూడలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలుపుతున్న నాయకులంతా దేశద్రోహులేనని ధ్వజమెత్తారు. దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుగ్ గతంలో జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడంతో, ఆయనపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదయిందని తెలిపారు.

కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ బంగ్లాదేశ్‌కు, పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతూ.. దేశ వ్యతిరేకులుగా మిగిలిపోతున్నారని అన్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్, అద్దంకి దయాకర్, ప్రకాష్ రాజ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది హిందూ వ్యతిరేకులు ఏకమవుతున్నారని చెప్పారు. నీట్ పరీక్ష పేరుతో ఢిల్లీలో అరాచకం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే (MLA Dhanpal) పేర్కొన్నారు. నీట్ లీకేజీ పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు.

విద్యార్థుల పాఠ్యాంశాల్లో అక్బర్, ఔరంగజేబు వంటి వారి చరిత్రను తొలగించినందుకా అని ప్రశ్నించారు. అంతకు ముందు పోలీసులు దిష్టి బొమ్మ దహనాన్ని అడ్డుకోవడంతో కొంత తోపులాట జరిగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కార్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, ఎర్రం సుధీర్, ఇప్పకాయల కిషోర్, చింతకాయల రాజేందర్, బెల్లాల్ శశాంక్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, న్యాలం సునీత రాజు, బంటు ప్రీతి ప్రవీణ్, మండలాధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: ‘నిరాహార దీక్ష విరమిస్తా.. కానీ’ : కేంద్రానికి సోనమ్​ వాంగ్​చుక్​ లేఖ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>