నీట్ పేపర్ లీకేజీపై మోదీ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీకేజీపై తొలిసారి ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. ‘పేపర్ లీక్ చేసినవారిని పట్టుకుని కఠినంగా శిక్షించేలా అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులకు నష్టం జరగకుండా, ఎలాంటి లోపాలు లేకుండా మరోసారి పరీక్షను విజయవంతంగా నిర్వహించాం. భవిష్యత్తులో పేపర్ లీకేజీలను పూర్తి స్థాయిలో అడ్డుకోవాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.

ఎంపీలకు దిశానిర్దేశం..

రెండో రోజు పార్లమెంట్ ప్రారంభానికి ముందు ఎన్డీయే పార్టీల ఎంపీలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. దీనికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు వంటి వారు కూడా హాజరయ్యారు. కీలక బిల్లులు ప్రవేశ పెట్టబోతున్న తరుణంలో.. వాటి ఆవశ్యకతను ఎంపీలకు వివరించినట్లు సమాచారం. అలాగే.. కొన్ని అంతర్గత అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>