దామోదర్ రెడ్డి సేవలు చిరస్మరణీయం: పోలాడి రామారావు

కలం, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా అభివృద్ధికి మాజీ మంత్రి, అప్పటి కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే ముద్దసాని దామోదర్ రెడ్డి (Muddaasani Damodar Reddy) చేసిన సేవలు చిరస్మరణీయం అని సీనియర్ నాయకులు, ముద్దసాని వీరాభిమాని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు (Poladi Rama Rao) పేర్కొన్నారు.

ముద్దసాని దామోదర్ రెడ్డి 70వ జయంతి సందర్బంగా కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని మానకొండూర్ మండల సరిహద్దులోని ప్రధాన హైవే సదాశివపల్లి కూడలి వద్ద నెలకొల్పిన దామోదర్ రెడ్డి విగ్రహానికి నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఆయన స్వీట్లు, పండ్లు పంపిణి చేశారు.

ఈ సందర్బంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. 29ఏళ్లకే ఎమ్మెల్యేగా, 30ఏళ్లకే మంత్రిగా పని చేసిన దామోదర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కరవు, భూగర్భ గనుల శాఖల మంత్రిగా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో ప్రభుత్వ సర్వీసుల, సాంకేతిక విద్యా శాఖ, రవాణా శాఖల మంత్రిగా పని చేసి కమలాపూర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి విశేష సేవలు అందించారని అన్నారు.

నిత్యం సామాన్యులకు, పేద, బడుగు బలహీన వర్గాలకు, రైతులకు, యువతకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేశారాన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే వారని తెలిపారు. కరీంనగర్ జిల్లా టైగర్ గా డేరింగ్, డాషింగ్ డైనమిక్ లీడర్ గా, దామన్నగా జిల్లా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. దామోదర్ రెడ్డి లాంటి నాయకులు నేడు అరుదు అని అన్నారు.

ఎందరో సామాన్య కార్యకర్తలను నాయకులుగా, ఎమ్మెల్యేలుగా తీర్చి దిద్దిన దామోదర్ రెడ్డి మా అందరికి స్ఫూర్తి దాయకమని, ఆయన ఆశయాలను పాటిస్తూ ఆయన బాటలో నడవడమే నిజమైన నివాళి అని పోలాడి రామారావు ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తుమల్లేశం, స్థానిక కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్, నాయకులు కొత్తూరు జగన్ గౌడ్, ముద్దసాని కృష్ణారెడ్డి, ఆడెపు కమలాకర్, సింగిరెడ్డి ఎల్లారెడ్డి, బండి నరేష్ కార్పొరేటర్ అజయ్ గౌడ్, కనకం కుమార్, తాళ్లపల్లి అంజయ్యలతో పాటు ముద్దసాని అభిమానులు ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Read Also: హైద‌రాబాద్‌లో ఇందిర‌మ్మ ఎల్ఐజీ ఇళ్ల‌కు శ్రీకారం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>