కలం, వెబ్ డెస్క్: ఇవాళ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కుమార్తె సితార ఘట్టమనేని బర్త్డే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వేదికగా మహేశ్ బాబు ఎమోషనల్ పోస్టు పెట్టారు. ‘నువ్వు ఎంత ఎదిగినా… ఎప్పటికీ నా చిన్న తారవే’ అంటూ తన కూతురిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. ఆత్మవిశ్వాసంతో ఎదుగుతున్న సితార ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మహేశ్ బాబు చేసిన ఈ పోస్టుకు అభిమానులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

