ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం

కలం, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కాం (AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి (A1), రాజ్ కసిరెడ్డి (A4), మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ (A8)కు పీటీ వారెంట్ జారీ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులు.. పీటీ వారెంట్‌పై విచారించేందుకు విజయవాడకు పోలీసులు తరలించారు.

ఈ కేసులో పూర్తి ఆధారాలను సేకరించేందుకు మరింత లోతుగా ఏపీ సీఐడీ సిట్ అధికారులు విచారించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ టెండర్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. అయితే టెండర్ల నిబంధనలు మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.195 కోట్ల మేర నష్టం జరిగిందని ఈడీ దర్యాప్తు వేగవంతం చేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>