72వ నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను (National Film Awards) నేడు అధికారికంగా ప్రకటించింది. 2024 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు సెన్సార్ బోర్డు ధృవీకరణ పత్రాలు పొందిన సినిమాలను ఈ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ప్రముఖ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని 11 మంది సభ్యుల జ్యూరీ కమిటీ దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో వచ్చిన చిత్రాలను పరిశీలించి విజేతలను ఎంపిక చేసింది.

భారతీయ సినిమా రంగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఉత్తమ నటుడు, నటి, దర్శకుడు, ఉత్తమ చిత్రం, సాంకేతిక విభాగాలతో పాటు ఫీచర్, నాన్ ఫీచర్ విభాగాల్లో ఈ పురస్కారాలను (National Film Awards) ప్రకటించారు. ఈసారి అవార్డుల రేసులో తెలుగుతో పాటు మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు నిలిచారు.

బెస్ట్ ఫిలిం క్రిటిక్‌ – సంజీవ్ శ్రీవాత్స ఫర్ హిందీ, ఉత్తమ తెలుగు చిత్రం – కమిటీ కుర్రోళ్లు, ఉత్తమ తమిళ చిత్రం – రాయన్, ఉత్తమ హిందీ చిత్రం – శ్రీకాంత్ కు, ఉత్తమ మళయాల చిత్రం – ఫెమినిస్ట్​ ఫాతిమా, ఉత్తమ సహాయ నటుడు – సంజయ్​ మిశ్రా, ఉత్తమ దర్శకుడు– రాజ్​ కుమార్​ (అమరన్​), ఉత్తమ సంగీతం – జీవీ ప్రకాశ్​, ఉత్తమ కాస్ట్యూమ్​ డిజైన్–​ పుష్ప–2, ఉత్తమ నటి– యామీ గౌతమి (ఆర్టికల్​ 370), ఉత్తమ బాలల చిత్రం– ఇది చిన్న కథ కాదు, ఉత్తమ చిత్రం –ఆర్టికల్​ 370, ఉత్తమ ప్రజాదరణ సినిమా – కల్కి, ఉత్తమ కన్నడ చిత్రం – మిథ్య కు అవార్డ్స్ దక్కాయి.

Read Also: మెదక్ చారిత్రక వైభవానికి మంచు విష్ణు ఫిదా.. ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>