మెక్సికోను వణికించిన భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ!

కలం, వెబ్ డెస్క్ : దక్షిణ మెక్సికో పసిఫిక్ తీరంలో భారీ భూకంపం (Mexico Earthquake) సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 7.3 నుండి 7.4గా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించారు. భూకంప కేంద్రం అక్విలెస్ సెర్డాన్‌కు నైరుతి దిశలో 48 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప ధాటికి మెక్సికో సిటీతో పాటు పొరుగు దేశాలైన గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్‌లలో కూడా పెద్ద పెద్ద భవనాలు తీవ్రంగా కంపించాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంపం తీవ్రత దృష్ట్యా అధికారులు తక్షణమే అత్యవసర ప్రోటోకాల్స్‌ను యాక్టివేట్ చేశారు.

ఈ భూకంపం నేపథ్యంలో అధికారులు తీర ప్రాంతాలకు గరిష్ట అలర్ట్ ప్రకటించారు. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని మెక్సికో, గ్వాటెమాలా పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది, రక్షణ అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ భవనాల పటిష్టతను, జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ విపత్తు కారణంగా సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>