ధర్మపురి డిగ్రీ లెక్చర్ల నియామకానికి క్యాబినెట్​ ఓకే.. సీఎంకి అడ్లూరి కృతజ్ఞతలు

కలం, కరీంనగర్​ : రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన కీలక అంశానికి క్యాబినెట్ (Telangana Cabinet) ఆమోదం తెలిపింది. ధర్మపురికి మంజూరైన డిగ్రీ కళాశాలకు 29 మంది అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ధర్మపురి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలో మూతబడిన నైట్ కళాశాలను తెరిపించడంతో పాటు నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టారు.

తాజాగా ధర్మపురి డిగ్రీ కళాశాల సిబ్బంది నియామకానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చోరవ తీసుకున్నారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో డిగ్రీ కళాశాలకు 29 పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపినందుకు రేవంత్ రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్​ కృతజ్ఞతలు తెలియజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>