తాగునీరు వృధా చేసిన వ్య‌క్తి.. జ‌ల మండ‌లి భారీ ఫైన్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: హైద‌రాబాద్‌  (Hyderabad)లో తాగు నీటిని వృధా చేస్తున్న ఓ వ్య‌క్తికి జ‌ల‌మండ‌లి (Jalamandali) అధికారులు గ‌ట్టి షాకిచ్చారు. ఏకంగా రూ.5 వేల జ‌రిమానా విధించారు. వివ‌రాళ్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్ 33లో ఓ వ్య‌క్తి పైప్ ప‌ట్టుకొని తాగునీటితో ఇంటి ముందు శుభ్రం చేస్తూ క‌నిపించాడు. పైపుతో నీటిని వృథాగా పోనివ్వడంపై స్థానికులు జ‌ల‌మండ‌లి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించారు. ఈ సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకోవాలని హెచ్చరిస్తూ, రూ.5 వేల జరిమానాను ఏడు రోజుల్లోగా చెల్లించాలని సదరు వ్యక్తిని ఆదేశించారు. అంతేకాకుండా భవిష్యత్తులో మళ్లీ ఇలాగే నీటిని వృధా చేస్తే తాగునీరు, మురుగునీరు కనెక్షన్లను పూర్తిగా కట్ చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>