జానీ మాస్టర్‌కు ఊహించని షాక్

కలం, వెబ్ డెస్క్: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ (Jani Master)కు ఊహించని షాక్ తగిలింది. ఫిలిం ఫెడరేషన్ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారని, వారం రోజుల్లో బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఆయనకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న జానీ మాస్టర్ ఫెడరేషన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, 14న విచారణకు రావాలని సూచించినా హాజరు కాలేదని పేర్కొంది.

డ్యాన్సర్ల అసోసియేషన్ తీరుపై ఆగ్రహం..

డ్యాన్సర్ల అసోసియేషన్ తీరుపైనా ఫిలిం ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తీసుకున్న నిర్ణయాలు నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లు ఆక్షేపించింది. ఆమె ఏకపక్ష నిర్ణయాలు చెల్లదని, జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. డ్యాన్సర్ల ఉపాధికి ఎలాంటి నష్టం లేకుండా వ్యవహరించాలని సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>