రేపే RAW NTR ఈవెంట్.. పోలీసులు షాక్

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్టీఆర్ పేరు పెట్టుకుని చర్చనీయాంశంగా మారిన RAW NTR సంస్థ రేపు తిరుపతిలో ‘ఊరు వాడ’ పేరిట ఓ ఈవెంట్ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం తిరుపతిలోని ఓ హోటల్‌ని బుక్ చేసుకున్నారు. ఈ సంస్థతో తమకు సంబంధం లేదని.. ఎవరూ వెళ్లొద్దని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్లు పిలుపునిచ్చాయి.

ఈ గందరగోళం నేపథ్యంలో.. RAW NTR ఈవెంట్‌కు పర్మిషన్ ఇవ్వడం లేదని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల సమస్య నెలకొనే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పోలీసుల సూచనలతో.. హోటల్ యాజమాన్యం సైతం ఈవెంట్ నిర్వహించుకునేందుకు నిరాకరించింది.

నిర్వహించి తీరుతాం..

పోలీసులు, హోటల్ యాజమాన్యం పర్మిషన్లు నిరాకరించడంపై RAW NTR సంస్థను నడుపుతున్న సాయి రూప్ స్పందిస్తూ.. ఎలాగైనా, ఎక్కడైనా ఈవెంట్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. అంతేగాకుండా, తమ అభిమాన నటుడు ఎన్టీఆర్‌కు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

తాము కేవలం ఎన్టీఆర్ పేరు మీద సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నామని, రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఫ్యాన్స్ అసోసియేషన్ల నుంచి తమకు ఒత్తిళ్లు వస్తున్నాయని.. తమ నటుడి కోసం అభిమానులుగా చేసుకుంటే తప్పేంటన్నారు.

ఎన్టీఆర్ టీం అధికారిక ప్రకటన..

RAW NTR పేరుతో జరుగుతున్న హంగామాకు ఎన్టీఆర్ టీం ఇప్పటికే అధికారికంగా స్పందించింది. ఈ కార్యక్రమానికి, ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి అనధికార కార్యక్రమాలను ఎవరూ ప్రోత్సహించవద్దని, దీనికి ఎన్టీఆర్ నుంచి ఎలాంటి అనుమతి లేదని పేర్కొంది. రాజకీయ పరమైన ప్రకటనలతోనూ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది.

Read Also: ప్రాణత్యాగానికైనా సిద్ధం.. మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>