పుష్కరాల ఏర్పాట్లపై నిర్మల్ కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

కలం, నిర్మల్: రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మల్ (Nirmal) జిల్లా సోన్ మండలంలోని పుష్కర ఘాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

పుష్కరాల నాటికి ఘాట్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు. గత పుష్కరాల్లో నమోదైన భక్తుల రద్దీ వివరాలను తెలుసుకొని, ఈసారి అంచనా మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలనన్నారు. చేపట్టే అన్ని పనులు నాణ్యతతో, మన్నికగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పుష్కర ఘాట్లకు చేరుకునే మార్గాల్లో స్పష్టమైన సూచికల బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగిన పార్కింగ్ సౌకర్యాలు, రాకపోకలకు అనువైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. భక్తుల భద్రత, పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, లైటింగ్ తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఈ పరిశీలనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ అనిల్, తహశీల్దార్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>