కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు, భక్తుల జైజైధ్వానాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

