కలం, స్పోర్ట్స్: అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోనీ (Lionel Scaloni) చేసిన ఓ వ్యాఖ్య వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌పై సెమీఫైనల్ విజయం తర్వాత తన ఆటగాళ్లను ‘ఇండియోస్’ అంటూ ప్రశంసించాడు. స్పానిష్‌లో ‘ఇండియోస్’ అంటే అమెరికా ఖండంలోని స్థానిక ఆదివాసీలు అని స్కలోనీ చెప్పాడు. భారతీయులను ఉద్దేశించి ఆ పదం వాడలేదని స్పష్టం చేశాడు. తన ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడికైనా భయపడరని తెలిపాడు. కఠిన పరిస్థితుల్లోనే అత్యుత్తమ ఆట ఆడతారని కొనియాడాడు.
అయితే ఆ పదానికి కొన్ని సందర్భాల్లో ప్రతికూల అర్థం వచ్చే అవకాశం ఉందని తర్వాత గుర్తించాడు. అందుకే ఆ పదం వాడటంలో పొరపాటు జరిగి ఉండొచ్చని అంగీకరించాడు. ఇంగ్లండ్‌పై అర్జెంటీనా మరోసారి అసాధారణ కమ్‌బ్యాక్ చేసింది. 55వ నిమిషంలో వెనుకబడినా చివర్లో మెస్సీ ఇచ్చిన రెండు అసిస్టులతో ఎంజో ఫెర్నాండెజ్, లౌటారో మార్టినెజ్ గోల్స్ చేశారు. దీంతో అర్జెంటీనా 2-1తో గెలిచి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది.
మ్యాచ్ తర్వాత స్కలోనీ మరో ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. తన జట్టు ఒత్తిడిలోనే మరింత ప్రమాదకరంగా మారుతుందని అన్నాడు. ప్రత్యర్థి కాస్త తడబడితే అవకాశాన్ని వదులుకోదని చెప్పాడు. వరుసగా నాలుగు నాకౌట్ మ్యాచ్‌ల్లో కమ్‌బ్యాక్ విజయాలు సాధించిన అర్జెంటీనా ఇప్పుడు వరుసగా రెండో ప్రపంచకప్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉంది.

