కలం, సినిమా : సెన్షేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) తాజాగా ‘రావు బహదూర్'(Rao Bahadur) సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా చూసిన అనంతరం తన అభిప్రాయాన్ని పంచుకున్న ఆయన, ఈ చిత్రం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. తన పోస్టులో .. ” ఇప్పుడే రావు బహదూర్ చూశాను. సినిమాను ఎందుకు ప్రేమించామో మరోసారి గుర్తు చేసే అరుదైన, గొప్ప చిత్రాలలో ఇది ఒకటి. ప్రతి నిజమైన సినీ అభిమానికి నా ఒక్కటే విజ్ఞప్తి.. మీ జీవితంలో మూడు గంటలు ఈ సినిమాకు కేటాయించండి. ఈ చిత్రం మీ సమయం, ఓపిక, చప్పట్లకు పూర్తిగా అర్హమైనది” అని పేర్కొన్నారు.
అలాగే దర్శకుడు ‘వెంకటేష్ మహా’ను ప్రత్యేకంగా అభినందిస్తూ.. “పరిమిత బడ్జెట్‌లో ఇంత ఖచ్చితత్వంతో ఈ సినిమాను తెరకెక్కించాలంటే ఎంతో ధైర్యం, నమ్మకం కావాలి. వెంకటేష్ మహా సినిమాను అద్భుతంగా రూపొందించారు. హీరో సత్యదేవ్ కూడా అద్భుతంగా నటించారు. ఇందులో ఎలాంటి హంగామా లేదు.. షార్ట్‌కట్స్ లేవు.. స్వచ్ఛమైన సినిమా మాత్రమే ఉంది అని ప్రశంసించారు.
ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి, సంబరంగా జరుపుకోవాలి” అని అన్నారు. అంతేకాకుండా సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ కార్తిక్, సంగీత దర్శకుడు స్మరణ్, ప్రొడక్షన్ డిజైనర్ రోహన్, కాస్ట్యూమ్ డిజైనర్ శిల్పల పనితీరును కూడా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ప్రత్యేకంగా అభినందించారు.
Read Also: శేఖర్ మాస్టర్‌తో గొడవ.. క్లారిటీ ఇచ్చిన జానీ మాస్టర్
Follow Us On: Instagram

