కలం, స్పోర్ట్స్ : ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు కొత్త కోచ్ కోసం జరుగుతున్న అన్వేషణలో భారత దిగ్గజం రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) పేరు వినిపిస్తోంది. బ్రెండన్ మెకల్లమ్‌ను టెస్ట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత, ద్రావిడ్‌తో పాటు మాజీ ఇంగ్లండ్ కోచ్ ఆండీ ఫ్లవర్, మాజీ స్పిన్నర్ రిచర్డ్ డాసన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు డైలీ టెలిగ్రాఫ్ నివేదిక తెలిపింది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను 1-2తో కోల్పోయిన తర్వాత ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఈ మార్పు చేసింది. అయితే మెకల్లమ్ వన్డే, టీ20 జట్ల కోచ్‌గా కొనసాగనున్నారు.
2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ అందించిన ద్రావిడ్‌ను ఆయన అనుభవం, ఆటపై ఉన్న అవగాహన కారణంగా బలమైన అభ్యర్థిగా భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే పూర్తి సమయ కోచింగ్‌పై ఆయనకు ఆసక్తి లేదని కూడా వెల్లడించింది. ఈ జాబితాలో కుమార సంగక్కర, ఆండ్రూ ఫ్లింటాఫ్, మైక్ హెస్సన్, జస్టిన్ లాంగర్ పేర్లు కూడా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

