Samantha Marriage | సమంత రాజ్ నిడుమోరును రెండో పెళ్లి చేసుకుంది. ఇది కామన్ న్యూస్. కానీ ఆమె భూతశుద్ధి వివాహం చేసుకుంది. ఇదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. భూతశుద్ధి వివాహం అంటే దీనికి చట్టబద్ధత అనేది ఉండదని ఈషా ఫౌండేషన్ లిటరేచర్ ను బట్టి అర్థం అవుతోంది. ఈ పేరులోనే మనకు పెళ్లి మీనింగ్ ఏంటో అర్థమైపోతోంది. సమంత ఒక స్టార్ హీరోయిన్. వందల కోట్ల ఆస్తులున్నాయి. తలచుకుంటే లగ్జరీ హోటల్స్, రిసార్ట్ లో పెళ్లి చేసుకోవచ్చు. కానీ జస్ట్ 30 మంది మధ్య, ఈషా ఫౌండేషన్ లోని లింగభైరవి దేవి విగ్రహం ముందు భూతశుద్ధి వివాహం చేసుకుంది. ఆమె చేసుకున్నది మామూలు పెళ్లి కాదు. భూతశుద్ధి అంటే మానవ శరీరంలో ఉన్న పంచ భూతాలను శుద్ధి చేసి మరీ పెళ్లి చేసుకోవడం.
భూతశుద్ధి అంటే..?
భూత అనగా పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు అనేవి. శుద్ధి అంటే వీటన్నింటినీ శుద్ధీకరణ చేయడం. భూతశుద్ధి అనేది మనిషి శరీరంలా, మనసులో నిర్మితమై ఉన్న పంచభూతాలను శుద్ధి చేసి, వాటిని విశ్వంలోని మూలకాలతో సమన్వయం చేసే ఒక ప్రాథమిక యోగ సాధన. దీన్ని ఈషా ఫౌండేషన్ రూపొందించింది. మనిషి బాడీ, మనస్సు, మన శక్తి.. ఈ పంచభూతాలతో ఏర్పడతాయి కాబట్టి వీటిని శుద్ధి చేయడం ద్వారా మనిషిలోని అశుద్ధత, భౌతిక, మానసిక రుగ్మతలను కూడా శుద్ధి చేయడమే దీని ప్రత్యేకత.
చట్టబద్ధత ఉండదా..?
సమంత చేసుకున్న పెళ్లి(Samantha Marriage) చట్ట బద్ధంగా ఉండదు. ఆమె పెళ్లికి పంచభూతాలు సాక్షిగా ఉంటాయి. ఇదే సాధారణ పెళ్లికి భూతశుద్ధి పెళ్లికి ఉన్న తేడా. పంచభూతాలను శుద్ధి చేస్తూ వాటి సాక్షిగా పెళ్లి చేసుకున్న వారు ఎప్పటికీ విడిపోరు అనేది ఇందులోని అర్థం. వాళ్ల పెళ్లికి పంచభూతాలే సాక్షిగా ఉంటూ కాపాడుతాయనేది ఈ క్రతువులోని మీనింగ్. అందుకే సమంత, రాజ్ నిడుమోరు(Raj Nidimoru) మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోరని తెలుస్తోంది. వీరిద్దరూ ఎప్పటికీ విడిపోకూడదు అనే ఉద్దేశంతోనే ఈ పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే సమంత, రాజ్ గతంలో వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నవారే. కాబ్టటి ఇంకోసారి అలాంటి పొరపాటు జరగకూడదని భావించి ఆడంబరాలకు దూరంగా ఈ పెళ్లి చేసుకున్నారంట.
Read Also: భూత శుద్ధి వివాహం చేసుకున్న సమంత… ఎలా చేస్తారంటే?
Follow Us on: Facebook


