కలం, సినిమా : నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) , టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని(Gopichand Malineni) కాంబినేషన్లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ సినిమా మంచి విజయం సాధించింది. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్(Manchu Manoj) విలన్గా నటించనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.
ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చడంతో మంచు మనోజ్ (Manchu Manoj) సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇటీవల రిలీజ్ అయి బ్లాక్ బస్టర్గా నిలిచిన మిరాయ్(Mirai) సినిమాలో మనోజ్ విలన్గా మెప్పించిన సంగతి తెలిసిందే. మిరాయ్ సినిమాలో మనోజ్ నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే బాలయ్యతో మనోజ్ కి మంచి బాండింగ్ ఉంది. గతంలో మనోజ్ నటించిన “ఊ కొడతార ఉలిక్కి పడతార ” సినిమాలో బాలయ్య కీలక పాత్రలో నటించాడు. దీనితో బాలయ్య, మనోజ్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులని సర్ప్రైజ్ చేయనుంది.

