epaper
Wednesday, March 4, 2026
epaper

వైభవంగా అర్జున్ టెండూల్కర్ మెహందీ వేడుక

కలం, వెబ్​ డెస్క్​ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైలో జరుగుతున్న ఈ వివాహ వేడుకల్లో భాగంగా అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ జంటకు సంబంధించిన మెహందీ అలాగే సంగీత్ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ వేడుకలో సచిన్ టెండూల్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతున్న ఈ వేడుకల్లో సచిన్ కుటుంబం ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. ఇక ఈ జంట రేపు మార్చి 5వ తేదీన వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!