epaper
Sunday, March 1, 2026
epaper

హనుమ‌కొండ‌, జ‌న‌గామ జిల్లాల‌కు కొత్త క‌లెక్ట‌ర్లు..!

కలం, జనగామ/వరంగల్ బ్యూరో: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ బ‌దిలీలు జ‌రిగాయి. హనుమకొండ, జ‌న‌గామ జిల్లాల‌కు కొత్త క‌లెక్ట‌ర్లు వ‌చ్చారు. హ‌నుమ‌కొండ‌ (Hanumakonda) జిల్లా కలెక్టర్‌గా చాహత్ బాజ్ పాయ్ (Chahat Baj Pay) నియమితులయ్యారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న ఆమెను స్నేహ శబరీష్ స్థానంలో ప్రభుత్వం బదిలీ చేసింది. కలెక్టర్ బాధ్యతలతో పాటు మున్సిపల్ కమిషనర్‌గానూ ఆమె పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. స్నేహ శభరీష్ మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. వరంగల్ జిల్లా భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ వైవీ గణేష్ వరంగల్ అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) బదిలీపై వెళ్లనున్నారు.

జనగామ జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా

జనగామ (Jangaon) జిల్లా నూతన కలెక్టర్‌గా జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) నియమితులయ్యారు. జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జోగులాంబ గద్వాల జిల్లాకు బదిలీ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!