epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపం “గొల్ల రామవ్వ”

కలం, సినిమా : తెలుగుజాతి గర్వం, స్వర్గీయ భారత మాజీ ప్రధాని, భారతరత్న పి.వి.నరసింహారావు (P.V. Narasimha Rao) రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపం “గొల్ల రామవ్వ” (Golla Ramavva). ప్రఖ్యాత రచయిత ముళ్ళపూడి వెంకటరమణ తనయుడు ముళ్లపూడి వరా (Vara Mullapudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంఛిత వీరగాథను సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్, వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై రామ్ విశ్వాస్ హనూర్కర్, రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

పేరొందిన పలు మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలిగిన అజహర్ షేక్ ఈ చిత్రానికి కార్యనిర్వాహక నిర్మాతగా కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటుగా  సాహిత్యం సమకూర్చడం విశేషం. ఇంతకుముందు ఈటీవీ విన్ కోసం “మౌనమే నీ భాష” చిత్రాన్ని నిర్మించి వీక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన టీమ్ నుంచి వస్తున్న “గొల్ల రామవ్వ” ఈనెల 25 (జనవరి 25) నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. “తెలుగు సీతామాలక్ష్మి” తాళ్ళూరి రామేశ్వరి (Talluri Rameshwari) టైటిల్ పాత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>