అర్హులైన పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు కావాలి: నిరంజన్‌రెడ్డి

కలం, వనపర్తి: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంపై యువతలో అవగాహన పెంపొందించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు వ్యాపార సముదాయాలను ఆయన సందర్శించారు.

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌, కాసం ఆన్‌లిమిటెడ్‌, గరుడ, ట్రెండ్స్‌, చందన బ్రదర్స్‌, బి-ఫిట్‌ రెడీమేడ్‌ తదితర సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులను స్వయంగా కలిసి ఓటరు నమోదు ఫారాలను అందజేశారు. నమోదు ప్రక్రియ, సమర్పించాల్సిన ధ్రువపత్రాలపై వివరించి, అర్హులైన వారంతా సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవగాహన లోపం కారణంగా పట్టభద్రుల ఓటరు నమోదు ఆశించిన స్థాయిలో జరగడం లేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇప్పటివరకు 36 శాతం మంది పట్టభద్రులు మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని పేర్కొంటూ, ఈ పరిస్థితి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని అన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు 100 శాతం జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న యువత ఓటు నమోదు ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు. అర్హులైన అభ్యర్థులను ఎన్నుకోవడంలో పట్టభద్రుల ఓటు కీలకమని పేర్కొన్నారు. నిరంజన్‌రెడ్డి ఆయా సంస్థలకు రావడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్‌, వాకిటి శ్రీధర్‌, గంధం పరంజ్యోతి, మాణిక్యం, ఉంగ్లం తిరుమల్‌, నాగన్న యాదవ్‌, గులాం ఖాదర్‌ ఖాన్‌, నీలస్వామి, జోహెబ్‌ హుస్సేన్‌, ఇమ్రాన్‌, సయ్యద్‌ జమీల్‌, మాధవ్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, సిరిగిరి మన్నెం, చిట్యాల రాము, అస్లాం, పాషా, మునికుమార్‌, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>