రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్: పీఎం రాహత్ (PM Rahat Scheme) పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో అత్యవసర వైద్యం అందించడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల అనుసంధానం, నిధుల విడుదల ప్రక్రియపై చర్చించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించడానికి పోలీస్ ఆమోదిత కేసులకు గరిష్టంగా 1 లక్షా 50 వేల రూపాయల వరకు పూర్తి చికిత్స అందించే అవకాశం ఈ పథకం ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత బాదితుల ప్రాణాలు కాపాడేందుకు గోల్డెన్ అవర్ ఎంతో కీలకమని, ఈ సమయంలో వేగంగా స్పందించాలని అన్నారు. ఈ పథకం సమర్థవంతమైన అమలు కోసం జిల్లా కలెక్టర్లు రహదారి భద్రత కమిటీలతో సమన్వయం చేసుకొని, జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు.

ప్రభుత్వ శాఖల నిర్మాణాలకు ఆమోదిత ఇసుకనే వాడాలి

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణాలన్నింటికీ ప్రభుత్వ ఆమోదిత ఇసుక మాత్రమే వినియోగించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అభివృద్ధి పనులు, నిర్మాణాలలో ఇసుక వినియోగంపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుత.. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి పనికి చట్ట ప్రకారం మాత్రమే ఇసుకను పొందాలన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడే విధంగా ఇతర మార్గాల్లో ఇసుక సేకరించి వాడటాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించాలని అన్నారు. నిర్మాణ పనులకు ఇసుకను పొందే మార్గాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులు పర్యవేక్షణ ఉంచాలని అన్నారు. నాసిరకం ఇసుక వాడటం వల్ల నిర్మాణాల్లో నాణ్యత లోపాలు తలెత్తుతాయని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు కూడా పారదర్శకంగా ఇసుక పొందాలని చెప్పారు. ఆయా నిర్మాణ పనుల్లో ఇసుక కొరత తలెత్తకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, మైనింగ్ అధికారి తిరుపతి రావు, ఆర్ అండ్ బి, నీటిపారుదల శాఖల ఈఈ లు సుభాష్, అనిల్, హౌసింగ్ పిడి శ్రీనివాస్, సిపిఓ గంగారెడ్డి, ఈడబ్ల్యుఐడిసి డిప్యూటీ ఈఈ గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>