చేగుంట ప‌రిశ్ర‌మ‌ల కాలుష్యంపై ప్రభాకర్ రెడ్డి అగ్ర‌హం

క‌లం, మెద‌క్ బ్యూరో: చేగుంట మండల కేంద్రంలోని జీవీకే (GVK) పరిశ్రమ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన కాలుష్య సమస్యలపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన నేరుగా పరిశ్రమను సందర్శించి, అక్కడ నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 10-20 సంవత్సరాల కిందట చిన్నపాటి యూనిట్‌గా ఉన్న ఈ పరిశ్రమ, ప్రస్తుతం 10 నుంచి 18 ఎకరాలకు పైగా విస్తరించిందన్నారు.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండానే నిబంధనలకు విరుద్ధంగా ఈ పరిశ్రమను నడిపిస్తున్నారని కొత్త ప్ర‌భాక‌ర్ తీవ్ర అరోప‌ణ‌లు చేశారు. రాత్రి సమయాల్లో, తెల్ల‌వారే వరకు పరిశ్రమ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ మరియు దుమ్ము కారణంగా స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీవీకే ఇండస్ట్రీ కాలుష్యం వ‌ల‌న‌ ఉదయం అయ్యే సరికి ఇళ్లపై నల్లటి పౌడర్ పొరలా పేరుకుపోతోందని చెప్పారు.

దీనివల్ల ముఖ్యంగా చిన్న పిల్లలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు రకరకాల వ్యాధులు సోకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న 7 నుండి 8 గ్రామాలలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయని, గాలి కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయికి చేరిందని, కంపెనీ త‌న వైఖ‌రీ మార్చుకొని ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయకుండా చూడాల‌ని ఎమ్మెల్యే కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి అదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>