కలం, స్పోర్ట్స్: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ షెడ్యూల్ విడుదలైంది. కతార్ రాజధాని దోహా వేదికగా నవంబర్ 19 నుంచి 29 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్ ‘ఏ’, పాకిస్థాన్ ‘ఏ’ (India vs Pakistan) జట్లు ఒకే గ్రూప్‌లో చేరాయి. గ్రూప్-బిలో భారత్, పాకిస్థాన్లతో పాటు నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. టోర్నమెంట్లో భారత్ ‘ఏ’ జట్టు తన తొలి మ్యాచ్‌ను నవంబర్ 20న నేపాల్‌తో ఆడనుంది. ఆ తర్వాత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ ‘ఏ’, పాకిస్థాన్ ‘ఏ’ మ్యాచ్ నవంబర్ 22న జరగనుంది. అనంతరం నవంబర్ 24న యూఏఈ జట్టుతో భారత్ తలపడనుంది.
మరోవైపు గ్రూప్-ఎలో శ్రీలంక ‘ఏ’, బంగ్లాదేశ్ ‘ఏ’, అఫ్గానిస్తాన్ ‘ఏ’, హాంకాంగ్ చైనా జట్లు పోటీపడనున్నాయి. సింగిల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ లీగ్ మ్యాచ్‌లలో ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. నవంబర్ 26, 27 తేదీలలో సెమీఫైనల్స్, నవంబర్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి. ఈ టోర్నీలోని మ్యాచ్‌లను వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, డోహా విశ్వవిద్యాలయం మైదానాల్లో నిర్వహిస్తారు. గత ఏడాది దోహాలోనే జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ ‘ఏ’పై గెలిచి పాకిస్థాన్ ‘ఏ’ ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి అన్ని జట్లు కూడా అత్యుత్తమ ప్రతిభను కనబరిచేందుకు సిద్ధమవుతున్నాయి.

