ఒబేదుల్లా కొత్వాల్‌కు ఏఐసీసీ కీలక బాధ్యత!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ ప్రచార కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఏఐసీసీ అబ్జర్వర్‌గా తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనాబ్ ఒబేదుల్లా కొత్వాల్ (Obedullah Kothwal) నియమితులైనట్లు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి బేనహర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈనెల 25న నుంచి తమిళనాడులో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా ఆయన(Obedullah Kothwal)కు తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి కార్పొరేషన్, తూత్తుకుడి సౌత్, తూత్తుకుడి నార్త్, కన్యాకుమారి ఈస్ట్, కన్యాకుమారి వెస్ట్, నాగర్‌కోయిల్ కార్పొరేషన్ జిల్లాల బాధ్యతలను ఏఐసీసీ అప్పగించింది.

ఈ ప్రాంతాల్లో ఓట్ బచావో – దేశ్ బచావో ప్రచార కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షిస్తూ, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఆయన కృషి చేయనున్నారు.

Also Read : సీఎం ఇంటిని ముట్టడిస్తాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వార్నింగ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>