ఎస్సై ప్రియాంకపై వేటు.. విచారణకు ఆదేశాలు

​కలం, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ మంత్రి విడదల రజినిని తోసేసిన ఘటనలో చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంక (SI Priyanka)పై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆమెను వెంటనే విధుల నుంచి తప్పించడంతో పాటు విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం విడదల రజిని తన ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఎస్సై ప్రియాంక అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె కిందపడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో పరిశీలించిన ఎన్నికల కమిషనర్ ఎస్సై ప్రియాంకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని నుజ్జునుజ్జైన ఆర్టీసీ బస్సు..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>