పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

కలం, వనపర్తి: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు (Graduate Voter Registration) చేసుకునేలా అన్ని శాఖల అధికారులు చొరవ చూపాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ డి.సునీతారెడ్డిని శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, ఇతర పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలను సందర్శించి ఉపాధ్యాయులు, అధ్యాపకులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన పట్టభద్రులందరూ బాధ్యతగా ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్‌, ఎస్పీకి శుభాకాంక్షలు

నూతన జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎస్పీ సునీతారెడ్డికి నిరంజన్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను పట్టణ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పలుస రమేష్‌గౌడ్‌, ఎస్పీని జిల్లా మీడియా కన్వీనర్‌ నందిమల్ల అశోక్‌ సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, గంధం పరంజ్యోతి, కురుమూర్తి యాదవ్‌, విజయ్‌కుమార్‌, గంధం బాలపీరు, జాతృ నాయక్‌, గులాం ఖాదర్‌ఖాన్‌, కె.మాణిక్యం, భానుప్రకాశ్‌రావు, వెంకట్‌ సాగర్‌, ఉంగ్లం తిరుమల్‌, నాగన్న యాదవ్‌, ధర్మా నాయక్‌, మహేశ్వర్‌రెడ్డి, జోహెబ్‌ హుస్సేన్‌, సయ్యద్‌ జమీల్‌, సూర్యవంశం గిరి, చిట్యాల రాము, నీలస్వామి, పెద్దముక్కల రవి, బొబ్బిలి ప్రేమ్‌కుమార్‌, అస్లాం, లక్ష్మణ్‌గౌడ్‌, శివగౌడ్‌, ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఆ ఎగ్జామ్‌ను వాయిదా వేయండి: సీఎం రేవంత్‌కు హరీశ్ రావు లేఖ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>