రిమ్స్‌లో విషాదం.. తల్లితో పాటు కవల శిశువులు మృతి!

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి (RIMS Hospital) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏడు నెలల గర్భిణీతో పాటు ఆమె కడుపులో ఉన్న కవల శిశువులు మృతి చెందడంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఉట్నూర్‌కు చెందిన బి. సునీత కాళ్ల వాపులతో ఈ నెల 21వ తేదీన రిమ్స్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. చికిత్స పొందుతున్న క్రమంలో రక్తపోటు పెరగడంతో ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె కడుపులో ఉన్న కవల శిశువులు కూడా మృతి చెందినట్లు సమాచారం.

ఒకేసారి తల్లి, ఇద్దరు శిశువులను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సునీత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యంపై వచ్చిన ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు స్పందించాల్సి ఉంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>