కలం, వెబ్ డెస్క్: చిత్తూరు (Chittoor) జిల్లా ఐరాల మండలం గుబ్బిళ్లవారిపల్లె సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో ఓ మగ అడవి ఏనుగు మృతిచెందిన (Elephant Death) ఘటన కలకలం రేపింది. పొలాల్లో వేలాడుతున్న హై టెన్షన్ విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలడం వల్లే ఏనుగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.
ఏనుగు శరీరంపై మూడు చోట్లు కరెంట్ తీగలు తగిలిన గుర్తులు స్పష్టంగా కనిపించినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయం పొలాల్లోకి వెళ్లిన స్థానిక రైతులు ఏనుగు మృతదేహాన్ని గమనించి, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.
Also Read : స్థానిక ఎన్నికల్లో దాడులపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Youtube

