తాడిపత్రిలో హై టెన్షన్.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా తాడిపత్రి(Tadipatri)లో హై టెన్షన్ నెలకొంది. వైఎస్సార్ సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని (Kethireddy Pedda Reddy) పోలీసులు వరుసగా మూడో రోజు కూడా గృహ నిర్బంధంలోనే ఉంచారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వగ్రామమైన యల్లనూరు మండలం తిమ్మంపల్లి ఎమ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ముందస్తుగా అడ్డుకున్న పోలీసులు, ఈ రోజు జరగనున్న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) కార్యక్రమానికి ఆయన బయలుదేరేందుకు యత్నించగా ఇంటి వద్దే పోలీసు బలగాలు నిలిపివేశాయి.

అయితే పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డిల చెప్పుచేతల్లోనే పోలీసులు పనిచేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన నామినేషన్ల ప్రక్రియను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్ సీపీ నాయకులను, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రి పరిధిలో చోటుచేసుకున్న ఈ వరుస పరిణామాలతో యల్లనూరు, తాడిపత్రి ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా నిఘాను తీవ్రతరం చేశారు.

Also Read : అమెరికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>