కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నారాయణఖేడ్ వాసులు మృతి!

కలం, మెదక్ బ్యూరో: కర్ణాటక రాష్ట్రంలోని బసవ కళ్యాణ్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Karnataka Accident) లో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన ఇద్దరు భక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మనూరు మండలానికి చెందిన కొంతమంది భక్తులు ప్రత్యేక వాహనంలో తుల్జాపూర్ భవానీ మాత దర్శనం కోసం బయలుదేరారు. మార్గమధ్యంలో కర్ణాటకలోని బసవ కళ్యాణ్ ప్రాంతానికి చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో మనూరు మండలానికి చెందిన ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం కర్ణాటకలోని బీదర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>