25న కరీంనగర్‌లో సైకిల్ ర్యాలీ: సీపీ గౌష్ ఆలం

కలం, కరీంనగర్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ పోలీస్ (Karimnagar Police)  కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ నెల 25న సైకిల్ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్, రూట్ మ్యాప్‌‌ను తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమవుతుందని సీపీ తెలిపారు.

సైకిల్ ర్యాలీ  బస్ స్టేషన్, ప్రతిమ మల్టీప్లెక్స్, గీతాభవన్ చౌరస్తా, మంకమ్మతోటలోని పొన్నం కాంప్లెక్స్, కెమిస్ట్ భవన్ మీదుగా ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్ద యూ టర్న్ తీసుకుంటుంది. కోర్ట్ చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, నాఖా చౌరస్తా, బోట్ చౌరస్తా, కమాన్ చౌరస్తా, తిరిగి బస్టాండ్ సర్కిల్, ప్రతిమ మల్టీప్లెక్స్ మీదుగా ప్రయాణించి తిరిగి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ముగుస్తుంది. సైక్లింగ్ ర్యాలీ నగరంలో 20 కిలోమీటర్లు జరుగుతుందని సీపీ పేర్కొన్నారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>